తేదీ : 5 ఆగష్టు 2022 (శుక్రవారం )
సమయం : సాయంత్రం : 7.00 గంటల నుంచి 8. 30 నిమిషాలు వరకు
స్థలము : పోచమ్మ దేవాలయము, పోచమ్మ బస్తీ, దేవేందర్ నగర్, భాగ్యనగర్., కుత్బుల్లాపూర్ మండలము.
కార్యక్రమ స్వరూపము :-
సాయంత్రం : 6.30 గంటలకు అందరూ చేరుకోవలెను
సాయంత్రం : 7. 00 గంటలకు గణేష్ పార్థనతో ప్రారంభము
::. ప్రార్థన
::.భజన పాటలు
::.ధర్మ సందేశం 5 నిమిషాలు
::.108 సార్లు రామ నామ స్మరణ
::.హనుమాన్ చాలీసా (ఒక్కసారి )
::.లింగాష్టకము
::.హారతి
::. కోలాటం
గమనిక :- లోక క్షేమం కోసము జరిగే ఈ రామ నామ స్మరణకు ప్రతి ఒక్కరూ వారి వారి సంకల్పంతో పాల్గొనగలరని మనవి.
ఈ సమాచారాన్ని వీలుంటే కనీసం 11 మంది షేర్ చేయగలరని మనవి.
ఇట్లు
ధర్మా జాగరణ
పూర్తి వివరాలుకు : +91 6301767565
-:- -:- -:- -:- -:-
ఈ నెల లో ఈ పాటను ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోగలరని మనవి
ఓం నమో భగవతే వాసుదేవాయ
భారత మాత కి - జై
ఓం... ఓం... ఓం...
శుక్లాం బరధరం విష్ణుం
శశివర్ణం చతుర్భుజం !
ప్రసన్నవదనం ధ్యాయేత్
సర్వ విఘ్నేప శాంతయే !!
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశం !
అనేక దంతం భక్తానాం
ఏక దంతం ముపాస్మహే !!
గురు బ్రహ్మ
గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మె శ్రీ గురవే నమః
మాతృ దేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
అతిధి దేవోభవ
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విధ్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా
పద్మపత్ర విశాలాక్షీ పధ్మకేసరి వర్జినీ
నిత్యం పద్మాలయా దేవీ సామాపాతు సరస్వతీ
భగవతీ భారతీ పూర్ణేందు బింద్వన నాం .
శ్రీ కృష్ణ పరమాత్మ కి ... జై
సీతా రామ మూర్థి కి ... జై
భారత మాత కి... జై
జై జై గీత - భగవద్గీత
ఓం
గం గణపతియే నమో నమః
సిద్ది వినాయక నమో నమః
అష్ట వినాయక నమో నమః
గణపతి బప్పా మోరియా (3 Times)
భజన పాట
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|
అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము
ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము |2|
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము
నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము |2|
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
పాద ధూళి సోకిన శిల ఎంతో ధన్యము
వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము |2|
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
మధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ శాంతియే రాముని అవతారము |2|
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము
రామ కార్యము చేబట్టిన భక్తులెంతో ధన్యము
రామ నామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము |2|
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|
జై శ్రీ రాం - జై జై శ్రీ రాం
భరత మాతకీ - జై
సామూహికంగా
శ్రీ రామ జయ రామ జయ జయ రామ్
(108 సార్లు )
Comments
Post a Comment