శ్రీ రామ నామ స్మరణ కార్యక్రమము తేదీ : 2 ఆగష్టు 2022 (మంగళవారం )

ఆహ్వానము 
లోక క్షేమం కోసం శ్రీ రామ నామ స్మరణ కార్యక్రమము

తేదీ : 2 ఆగష్టు 2022 (మంగళవారం ) 


లోక క్షేమం కోసం, మానసిక ఆనందం కోసం రామ నామ స్మరణ.  

తేదీ : 2 ఆగష్టు 2022 (మంగళవారం )

సమయం : సాయంత్రం : 6.00 గంటల నుంచి 7. 30 నిమిషాలు వరకు 

స్థలము : శ్రీ సంజీవ హనుమాన్ దేవాలయము,  కళావతి నగర్, టి.ఎస్. ఐ. ఐ.సి. కాలనీ,   జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ మండలము. 

కార్యక్రమ స్వరూపము :-

సాయంత్రం : 5.30 గంటలకు అందరూ  చేరుకోవలెను  

సాయంత్రం : 5.30 గంటలకు సీతారాముల పట్టాభిషేకం పాఠం అలంకరణ 

సాయంత్రం : 6. 00 గంటలకు గణేష్ పార్థనతో ప్రారంభము 

::. ప్రార్థన 

::.భజన పాటలు 

::.ధర్మ సందేశం 5 నిమిషాలు 

::.108 సార్లు రామ నామ స్మరణ 

::.హనుమాన్ చాలీసా (ఒక్కసారి )

::.లింగాష్టకము 

::.హారతి 

::. కోలాటం 


గమనిక :- లోక క్షేమం కోసము జరిగే ఈ రామ నామ స్మరణకు ప్రతి ఒక్కరూ వారి వారి సంకల్పంతో పాల్గొనగలరని మనవి. 

ఈ సమాచారాన్ని వీలుంటే కనీసం 11 మంది షేర్ చేయగలరని మనవి. 


ఇట్లు 

శ్రీ సంజీవ హనుమాన్ ధర్మా జాగరణ  భక్తులు 

పూర్తి వివరాలుకు : +91 6301767565

 -:-  -:-  -:-  -:-  -:-  

ఈ నెల లో ఈ పాటను ప్రతి ఒక్కరు తప్పకుండా నేర్చుకోగలరని మనవి 

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|

అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము
ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము |2|

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము

రేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము
నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము |2|

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము

పాద ధూళి సోకిన శిల ఎంతో ధన్యము
వారధిని నిలిపిన సాగర జలమెంతో ధన్యము |2|

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము

మధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ శాంతియే రాముని అవతారము |2|

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము

రామ కార్యము చేబట్టిన భక్తులెంతో ధన్యము
రామ నామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము |2|

రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|

జై శ్రీ రాం - జై జై శ్రీ రాం
భరత మాతకీ - జై


Comments